Friday, November 16, 2018

ఓటును తల్లిగా భావించే గ్రామం ఓటాయి

ఓటాయి=ఓటు+ఆయి. (ఆయి=అమ్మ )(ఓటమ్మా).
ఓటును తల్లిగా భావించే గ్రామం ఓటాయి.

తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఒక గ్రామం ఓటును తల్లిగా కొలుస్తుంది ."ఓటాయి" గా పేరు కలిగిన ఈ గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా- 2543 మంది, మొత్తం జనావాసాలు- 688
గ్రామంలో పురుషుల జనాభా కన్న స్త్రీ జనాభా ఎక్కువ.51.1%.(1300మంది)
అక్షరాస్యత 51%(1298 మంది అక్షరాస్యులు)(తెలంగాణ సగటు అక్షరాస్యత కన్నా తక్కువ),
స్త్రీ ల అక్షరాస్యత 22.2%(565మంది)
మొత్తం జనాభాలో గిరిజన జనాభా 49.1%(1249 మంది) షెడ్యూలు కులాల జనాభా 12.7%(323)
ఓటాయి మొత్తం విస్తీర్ణం 270.08 హెక్టార్లు
వ్యవసాయేతర భూమి 26.52 హెక్టార్లు
వ్యవసాయ భూమి 245 హెక్టార్లు.
రాజ్యాంగంలోని 5 వ షెడ్యూల్ లో  పొందుపరచడ్డ ఈ గ్రామం ఇది
చారిత్రకంగా, భౌగోళికంగా ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ గ్రామం,కాకతీయుల కాలం నుండి తన ప్రత్యేకతను చాటుకుంటుంది.పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గిరిజన  గ్రామంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత   నుండి ఒక వైవిధ్య భరితమైన రాజకీయ సంసృతి ఫరిీడవిల్లుతుంది.కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష, ఆర్థిక భేదభావం లేకుండా దేశంలో నివసించే మేజర్‌ అయన ప్రతి యువతి, యువకుడు ఓటు హక్కు పొందే అవకాశం భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 326 కల్పిస్తున్నది ,దీన్ని గుర్తించి ఈ గ్రామ వాసులు 'ఓటు' అనే రెండక్షరాలకు ప్రపంచ గతిని మార్చే శక్తి ఉందని, ఓటు వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తిస్తుందని,వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుందని నమ్మి .ఓటు ఆవశ్యకత, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటుకున్న పాత్ర గురించి,ఓటు విలువ తెలిసిన ఈ గ్రామ పెద్దలు మొదటి సార్వత్రిక ఎన్నికల నుండి వారి గ్రామాన్ని ఓటాయి (ఓటు+ఆయి)గా పిలుస్తున్నారు. (ఆయి అంటే అమ్మ అని మనందరికీ తెలిసిందే) .2543 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో 850 పైచిలుకు ఓటర్లు ఉన్నారు
‘భారత ప్రజాస్వామ్య పరిరక్షణకోసం నా వంతు కర్తవ్యాన్ని గుర్తించి ఉన్నతమైన నాయకున్ని ఎన్నుకుంటానని’ ప్రతిజ్ఞ చేస్తూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం పోలింగ్ జరిగేలా ఆ గ్రామస్తులు కృషి చేస్తున్నారు