Sunday, March 31, 2019

"టూత్ బ్రష్"నోటి శుభ్రతకే కాదు దేశ భవితకు కూడా అంటున్న సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి రవి కుమార్ ఓదెల


మీరు ఎప్పుడు ఈ చాలెంజ్ విని ఉండరు.విని ఉంటే మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి ఈ ఛాలెంజ్ విసిరే వారే .ఎందుకంటే మీలాంటి అనేక మంది విజ్ఞాన వంతులు ఈ ఛాలెంజ్ విసురుతున్నారు. అవును ఇది దేశ భవిష్యత్తు కు సంబంధించిన ఛాలెంజ్...
ప్రభుత్వ ఉద్యోగం వదిలి సికింద్రాబాదు ఎంపీ గా "టూత్ బ్రష్ " గుర్తు పై పోటీ చేస్తున్న రవి కుమార్ అనుచర గణం అంతా ఇప్పుడు ప్రతీ రోజూ నోటి శుభ్రత కోసం ఉదయం , సాయంత్రం బ్రష్ చేయడం ఎంత ముఖ్యమో దేశ రాజకీయాల్లో గుణాత్మక  మార్పు కోసం, ఉన్నత విద్యా వంతులను చట్ట సభలకు పంపాలని దాని కోసం రవి కుమార్ " టూత్ బ్రష్" గుర్తుకి ఓటెయ్యడం అంతే ముఖ్యం అని చిన్న వీడియో సందేశం ద్వారా ఛాలెంజ్ విసురుతున్నారు. దీంతో చాలామంది బుద్ది జీవులు తమ బాధ్యత గా ఛాలెంజ్ స్వీకరించి,వారి వారి మిత్రులకు ఛాలెంజ్ విసురుతున్నారు.
మీరు కూడా దేశ భవిత కోసం ఆరాట పడే వారైతే
"బ్రష్ పట్టుకొని
నేను ఈ రోజు బ్రష్ చేశాను ..
మీరు బ్రష్ చేశారా...
చేస్తే బ్రష్ గుర్తుకు ఓటెయ్యండి
ఆరోగ్యంగా ఉండండి దేశాన్ని ఆరోగ్యంగా ఉంచండి.
Thank you Brush for cleaning the politics of the nation and my teeth as well "
 అని చిన్న వీడియోనీ తయారు చేసి Facebook, Twitter, tiktok, Instagram, WhatsApp,like,.
 లో  అప్లోడ్ చేయండి మీరు కూడా మీ మిత్రులకు చాలెంజ్ విసరండి.



Friday, March 29, 2019

సికింద్రబాద్ ఎంపీ గా పోటీ లో ఉన్న సామాజిక కార్యకర్త రవి కుమార్ వోదెల సుదూర లక్ష్యం చేరేనా... తమకి తగిన నాయకుడు దొరికాడనే సంబరంలో ఓటర్లు




ఢిల్లీలోని  ప్రతిష్టాత్మక సివిల్స్ కోచింగ్ సెంటర్ లో ఫ్యాకల్టీ , రోజంతా సివిల్స్ వాళ్ళకి పాఠాలు బోధించడం ,సాయంత్రం కాగానే బాల కార్మికులు ఉన్న ప్రదేశానికి చేరడం వారి బాగోగులు చూడడం వారిని పాఠశాలల్లో చేర్పించడం ఆయన రోజువారీ దిన చర్య..ఢిల్లీ లోని వీధి బాలలకు ఆ పేరు సుపరిచితం. వీధి బాలలంటే అతనికి వల్లమాలిన ప్రేమ , హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్ లో సభ్యుడు, ఢిల్లీ యూనివర్సిటీ లోని స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ లో  పరిశోధక విద్యార్థి.వందల మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి జాతి సౌధానికి మేలిమి ఇటుకలను తయారు చేస్తున్నా అతనిలో ఏదో అసంతృప్తి .ప్రత్యక్ష సామాజిక  మార్పు కోసం విజ్ఞాన వంతులు, నిబద్దత కలిగిన యువత రాజకీయాల్లోకి వెళ్లి శాసన కర్తలుగా మారాలని ప్రతి రోజు తరగతి గదిలో బోధించే అతను ఒకరోజు హఠాత్తుగా ఢిల్లీ వదిలి హైదరాబాద్ చేరారు.తనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తన అంతిమ లక్ష్యమైన సామాజిక రుగ్మతల నివారణ కోసం తనే ఒక శాసన కర్త గా మారాలని తీర్మానించుకున్నాడు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నాడు.
అసలు ఇంతటి నిబద్దత కలిగిన అతని నేపథ్యం ఏంటని ఆరా తీయగా ఆసక్తికర విషయాలు తెలిశాయి
అతనిది మహబూబాబాద్ పట్టణం 10వ యేటనే కుటుంబ భారాన్ని తనపై వేసుకున్న బాల కార్మికుడు, రాత్రనక, పగలనక కష్టప డి కుటుంబాన్ని పోషించేవాడు,ఆ చిరు ప్రాయంలోనే విద్య విలువ తెలుసుకొని, తను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి చదువు ఒక్కటే మార్గమని నమ్మి ఒక పూట పాఠశాలకు , మరొక పూట పనికి వెళ్ళడం ప్రారంభించాడు.ఉదయం తన దిన చర్య ఇంటింటికీ న్యూస్ పేపర్ వేయడంతో ప్రారంభం అయ్యేది.ఒక రోజు న్యూస్ పేపర్ లో వారి జిల్లా కలెక్టర్ నీ  సన్మానించడం అనే వార్త  చూసాడు.ఆ వార్త చదువుతున్న  క్రమంలోనే కలెక్టర్ అనే ఉద్యోగం ఉంటుందని తెలుసుకున్నాడు. ఆ ఉద్యోగం వస్తె తన లాంటి అనేక మందికి ఆసరాగా నిలబడవచ్చని ,ఆ లేత వయసులోనే కలెక్టర్ కావాలని నిర్ణయించుకున్నాడు, ఒక రోజు పాఠశాలలో ఉపాధ్యాయుడు పెద్దయ్యాక మిరేమవుతారు అనే ప్రశ్నకు కలెక్టర్ అవుతానని సమాధానమిచ్చాడు. ఒక్కసారి తరగతి గది అంతా నువ్వు పాఠశాలకు వచ్చేదే ఒక్క పూట అంటూ వెటకారపు నవ్వుతో దద్దరిల్లిపోయింది.  అప్పుడే తనలో ఉన్న కలెక్టర్ కావాలన్న కాంక్ష మరింత బలపడింది.
కలెక్టర్ కావాలంటే ఐఏఎస్ చదవాలని ,అది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది అని మన లాంటి పేద వాళ్ళకి అది సాధ్యం కాదని చాలామంది చెప్పారు. నీ వల్ల కాదు అన్న ప్రతి సారి తనలోని కాంక్ష  మరింత బలపడింది. ఒక్కటే ధ్యాస కలెక్టరు కావడమే.పేపర్ బాయ్, రిక్షా పుల్లర్, టూషన్ మాస్టర్ గా వివిధ పనులు చేసుకుంటూ ఇంటర్ ,డిగ్రీ చదివేరోజుల్లోనే  "సేవా భారతి" అనే స్వచ్చంధ సంస్థ ద్వారా మారుమూల గిరిజన తండాల్లోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లోనీ గిరిజన కుసుమాలకి  ఐదు సంవత్సరాలపాటు విద్యాబుద్దులు నేర్పించారు, ఆ క్రమంలో గిరిజన తండాల్లోని  విద్యార్థుల దీన స్థితి తన చేరాల్సిన  గమ్యం ఏంటో స్పష్టంగా నిర్ధారించుకునేందుకు దోహద పడింది.అప్పటి నుండి తన ఐఏఎస్ ఆశయాన్నే శ్వాసగా మలుచుకున్నాడు.
మొత్తం మీద బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మి నిస్ట్రేషన్ (BBM) పూర్తి చేశాడు. ఐఏఎస్ పరీక్ష రాయడానికి కావల్సిన కనీస అర్హత  సాధించాడు. అప్పుడే ప్రభుత్వం "మెరుగు" అనే కార్యక్రమం ప్రారంభించింది.(డిగ్రీ  చదువుతున్న వారిని ఒక పరీక్ష ద్వారా ఎంపిక చేసి  పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే కార్యక్రమం ఇది) "మెరుగు" కార్యక్రమం వారు నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించి డిగ్రీ తో పాటు ఇతర పోటీ పరీక్షలకు కూడా శిక్షణ పొందాడు.అప్పుడే  ఐఏఎస్ చదవాలంటే హైదరాబాద్ లో ఉండాలి,  మెరుగైన కోచింగ్ అవసరం అని తెలుసుకొని. హైదరాబాద్ లో ఉండడం ఎలా అని ఆలోచిస్తుంటే ఒక స్నేహితుడి సలహా మేరకు లాసెట్ రాసి రాష్ర్ట స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించాడు.
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ లో సీట్ సంపాదించాడు. సివిల్స్ కోసం సీరియస్ గా ప్రిపరేషన్ ప్రారంభించాడు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ నుండి అశోక్ నగర్ కి ప్రతి రోజూ నడుచుకుంటూ వచ్చేవాడు, మధ్యాహ్నం రెండు అరటిపళ్ళు రెండు గ్లాసుల నీళ్లతో కడుపు నింపుకొని చదివి తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు. గ్రామీణ నేపథ్యం, మామూలు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివి ఉండడం వల్ల సహజంగా ఉండే బెరుకు వల్ల ఇంటర్వ్యూ బోర్డ్ ను మెప్పించలేక స్వల్ప మార్కులతో సర్వీస్ కోల్పోయాడు.
అయినా స్థైర్యాన్ని కోల్పోకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు. అలా నాలుగు సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా యూపిఎస్సి ఇంటర్వ్యూ బోర్డ్ తన ప్రతిభను గుర్తించలేక పోయింది.
ప్రిపరేషన్ లో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మోడల్ స్కూల్ లో పీజీటీ ఉద్యోగం వచ్చింది. కాని చిన్నప్పటి నుండి తన లాంటి వాళ్లను దారిద్ర్య శృంఖలాల నుండి బయట పడేయాలన్న సంకల్పం, ఐఏఎస్ సాధించాలన్న  తపన మస్తిష్కంలో నాటుకుపోవడంతో ఆ ఉద్యోగాన్ని సైతం వదిలేశాడు. అప్పటికి తను ఇంటి నుండి బయటికి వచ్చి సరిగ్గా 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల కాలంలో తన గుండె చప్పుడు సివిల్స్ ..సివిల్స్.. ..ఈ 15 సంవత్స రాల కాలంలో తను అమ్మా నాన్నలతో గడిపిన రోజులు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. నాలుగవ సారి   ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అవుతున్న సమయంలోనే వాళ్ళ అమ్మ ఆరోగ్యం క్షీణించడం.ఢిల్లీలో ఉన్న అతనికి ఈ విషయం కొంచెం లేట్ గా తెలియడం. హుటాహుటిన ప్రిపరేషన్ పక్కన పెట్టి హైదరాబాద్ కి రావడం, ట్రీట్మెంట్ ప్రారంభించే లోపు ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్ళడం,తన కన్న తల్లిని కాపాడుకో లేని నిస్సహాయ స్థితి తన మీద తనకే ఏహ్యభావం కలిగేలా చేసింది. ఆ బాధ లో నుండి కోలుకునే లోపే తండ్రి  దూరమవడం తనని మరింత కృంగ దీసింది. కానీ విధి ముందు లొంగి పోకుండా తన అంతిమ లక్ష్యం చేరడానికి ఐఏఎస్ అనేది ఒక మార్గం మాత్రమే నని.వేరే అనేక మేలిమి మార్గాలు ఉన్నాయని గ్రహించి  ఢిల్లీలో సివిల్స్ ఫ్యాకల్టీ గా చేరి అనేక మంది ఐఏఎస్ లను తయారు చేస్తూ, వివిధ స్వచ్చంధ సంస్థల్లో పనిచేస్తూ సామాజిక కార్యకర్త గా , పరిశోధకుడిగా కొనసాగుతున్నాడు.
ఆయనే రవికుమార్ వోదెల. ప్రస్తుతం కార్మిక, కర్షక, నిరుద్యోగ ,తాడిత, పీడిత వర్గాలు బల పర్చిన స్వతంత్ర అభ్యర్థిగా సికింద్రాబాదు పార్లమెంటు స్థానానికి  "టూత్ బ్రష్" గుర్తుతో పోటీ చేస్తున్నాడు. ఇలాంటి నాయకుడి కోసమే సికింద్రాబాదు ఓటర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉండడం కొసమెరుపు..

సికిందరాబాద్ ఎంపీ స్థానంలో ప్రభుత్వ ఉద్యోగం వదులుకున్న సివిల్స్ ఫ్యాకల్టీ

గ్రౌండ్ రిపోర్ట్ (సికింద్రాబాద్) మార్చ్ 29

అతనొక బాల కార్మికుడు,5వ యేటనే కుటుంబ భారాన్ని తనపై వేసుకుని రాత్రనక, పగలనక కష్టపడేవాడు,10 సంవత్సరాల ప్రాయంలోనే విద్య విలువ తెలుసుకొని, తను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి చదువు ఒక్కటే మార్గమని నమ్మి ఒక పూట పాఠశాలకు , మరొక పూట పనికి వెళ్ళడం ప్రారంభించాడు.ఉదయం తన దిన చర్య ఇంటింటికీ న్యూస్ పేపర్ వేయడంతో ప్రారంభం అయ్యేది.ఒక రోజు న్యూస్ పేపర్ లో వారి జిల్లా కలెక్టర్ నీ  సన్మానించడం అనే వార్త  చూసాడు.ఆ వార్త చదువుతున్న  క్రమంలోనే కలెక్టర్ అనే ఉద్యోగం ఉంటుందని తెలుసుకున్నాడు. ఆ ఉద్యోగం వస్తె తన లాంటి అనేక మందికి ఆసరాగా నిలబడవచ్చని ,ఆ చిరు ప్రాయంలోనే కలెక్టర్ కావాలని నిర్ణయించుకున్నాడు, ఒక రోజు పాఠశాలలో ఉపాధ్యాయుడు పెద్దయ్యాక మిరేమవుతారు అనే ప్రశ్నకు కలెక్టర్ అవుతానని సమాధానమిచ్చాడు. ఒక్కసారి తరగతి గది అంతా నువ్వు పాఠశాలకు వచ్చేదే ఒక్క పూట అంటూ వెటకారపు నవ్వుతో దద్దరిల్లిపోయింది.  అప్పుడే తనలో ఉన్న కలెక్టర్ కావాలన్న కాంక్ష మరింత బలపడింది.
కలెక్టర్ కావాలంటే ఐఏఎస్ చదవాలని ,అది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది అని మన లాంటి పేద వాళ్ళకి అది సాధ్యం కాదని చాలామంది చెప్పారు. నీ వల్ల కాదు అన్న ప్రతి సారి తనలోని కాంక్ష  మరింత బలపడింది. ఒక్కటే ధ్యాస కలెక్టరు కావడమే.పేపర్ బాయ్, రిక్షా పుల్లర్, టూషన్ మాస్టర్ గా వివిధ పనులు చేసుకుంటూ మొత్తం మీద బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మి నిస్ట్రేషన్ (BBM) పూర్తి చేశాడు. ఐఏఎస్ పరీక్ష రాయడానికి కావల్సిన కనీస అర్హత  సాధించాడు. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ప్రభుత్వం "మెరుగు" అనే కార్యక్రమం ప్రారంభించింది.(డిగ్రీ  చదువుతున్న వారిని ఒక పరీక్ష ద్వారా ఎంపిక చేసి  పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే కార్యక్రమం ఇది) "మెరుగు" కార్యక్రమం వారు నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించి డిగ్రీ తో పాటు ఇతర పోటీ పరీక్షలకు కూడా శిక్షణ పొందాడు.అప్పుడే  ఐఏఎస్ చదవాలంటే హైదరాబాద్ లో ఉండాలి,  మెరుగైన కోచింగ్ అవసరం అని తెలుసుకొని. హైదరాబాద్ లో ఉండడం ఎలా అని ఆలోచిస్తుంటే ఒక స్నేహితుడి సలహా మేరకు లాసెట్ రాసి రాష్ర్ట స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించాడు.
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ లో సీట్ సంపాదించాడు. సివిల్స్ కోసం సీరియస్ గా ప్రిపరేషన్ ప్రారంభించాడు. తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు. గ్రామీణ నేపథ్యం, మామూలు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివి ఉండడం వల్ల సహజంగా ఉండే బెరుకు వల్ల ఇంటర్వ్యూ బోర్డ్ ను మెప్పించలేక స్వల్ప మార్కులతో సర్వీస్ కోల్పోయాడు.
అయినా స్థైర్యాన్ని కోల్పోకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు. అలా నాలుగు సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా ఇంటర్వ్యూ బోర్డ్ తన ప్రతిభను గుర్తించలేక పోయింది. ఈ ప్రయాణంలో నే తనకి జన్మనిచ్చిన తల్లి తండ్రిని కోల్పోయాడు.
ప్రిపరేషన్ లో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మోడల్ స్కూల్ లో పీజీటీ ఉద్యోగం వచ్చింది. కాని చిన్నప్పటి నుండి తన లాంటి వాళ్లను దారిద్ర్య శృంఖలాల నుండి బయట పడేయాలన్న సంకల్పం బలంగా తన మస్తిష్కంలో నాటుకుపోవడంతో ఆ ఉద్యోగాన్ని సైతం వదిలేశాడు. ఆయనే రవికుమార్ వోదెల. ప్రస్తుతం సివిల్స్ ఫ్యాకల్టీ గా పనిచేస్తున్నాడు.  కార్మిక, కర్షక, నిరుద్యోగ ,తాడిత, పీడిత వర్గాలు బల పర్చిన స్వతంత్ర అభ్యర్థిగా సికింద్రాబాదు పార్లమెంటు స్థానానికి "టూత్ బ్రష్" గుర్తుతో పోటీ చేస్తున్నాడు.

Friday, November 16, 2018

ఓటును తల్లిగా భావించే గ్రామం ఓటాయి

ఓటాయి=ఓటు+ఆయి. (ఆయి=అమ్మ )(ఓటమ్మా).
ఓటును తల్లిగా భావించే గ్రామం ఓటాయి.

తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఒక గ్రామం ఓటును తల్లిగా కొలుస్తుంది ."ఓటాయి" గా పేరు కలిగిన ఈ గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా- 2543 మంది, మొత్తం జనావాసాలు- 688
గ్రామంలో పురుషుల జనాభా కన్న స్త్రీ జనాభా ఎక్కువ.51.1%.(1300మంది)
అక్షరాస్యత 51%(1298 మంది అక్షరాస్యులు)(తెలంగాణ సగటు అక్షరాస్యత కన్నా తక్కువ),
స్త్రీ ల అక్షరాస్యత 22.2%(565మంది)
మొత్తం జనాభాలో గిరిజన జనాభా 49.1%(1249 మంది) షెడ్యూలు కులాల జనాభా 12.7%(323)
ఓటాయి మొత్తం విస్తీర్ణం 270.08 హెక్టార్లు
వ్యవసాయేతర భూమి 26.52 హెక్టార్లు
వ్యవసాయ భూమి 245 హెక్టార్లు.
రాజ్యాంగంలోని 5 వ షెడ్యూల్ లో  పొందుపరచడ్డ ఈ గ్రామం ఇది
చారిత్రకంగా, భౌగోళికంగా ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ గ్రామం,కాకతీయుల కాలం నుండి తన ప్రత్యేకతను చాటుకుంటుంది.పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గిరిజన  గ్రామంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత   నుండి ఒక వైవిధ్య భరితమైన రాజకీయ సంసృతి ఫరిీడవిల్లుతుంది.కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష, ఆర్థిక భేదభావం లేకుండా దేశంలో నివసించే మేజర్‌ అయన ప్రతి యువతి, యువకుడు ఓటు హక్కు పొందే అవకాశం భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 326 కల్పిస్తున్నది ,దీన్ని గుర్తించి ఈ గ్రామ వాసులు 'ఓటు' అనే రెండక్షరాలకు ప్రపంచ గతిని మార్చే శక్తి ఉందని, ఓటు వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తిస్తుందని,వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుందని నమ్మి .ఓటు ఆవశ్యకత, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటుకున్న పాత్ర గురించి,ఓటు విలువ తెలిసిన ఈ గ్రామ పెద్దలు మొదటి సార్వత్రిక ఎన్నికల నుండి వారి గ్రామాన్ని ఓటాయి (ఓటు+ఆయి)గా పిలుస్తున్నారు. (ఆయి అంటే అమ్మ అని మనందరికీ తెలిసిందే) .2543 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో 850 పైచిలుకు ఓటర్లు ఉన్నారు
‘భారత ప్రజాస్వామ్య పరిరక్షణకోసం నా వంతు కర్తవ్యాన్ని గుర్తించి ఉన్నతమైన నాయకున్ని ఎన్నుకుంటానని’ ప్రతిజ్ఞ చేస్తూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం పోలింగ్ జరిగేలా ఆ గ్రామస్తులు కృషి చేస్తున్నారు

Wednesday, October 3, 2018

జూనియర్ పంచాయతీ కార్యదర్శి హాల్ టికెట్ డౌన్లోడ్

http://htno1.tsprrecruitment.in:8081/HallTicket.aspx

Click on above link


  Enter
              1.Your Mobile Number
              2.Date of Birth.


Telangana FRO Recruitment Interview Guidance&all exams

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ నియామకాల ఇంటర్వ్యూలు అక్టోబర్ 5&6 తేదీలలో ఉండబోతున్నాయి

ఇంటర్వ్యూ కి  హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేకం



తెలంగాణ అడవులు -జాతీయ అటవీ
విధానాలు.1952,1988,
నూతన అటవీ విధానం ముసాయిదా2018

  • ఒక ప్రాంతంలో సహజసిద్ధంగా పెరిగిన అనేక రకాల వృక్షాలతో కూడుకున్న ప్రదేశాన్ని అడవి అంటారు.
  • అడవులను ఆంగ్లంలో ఫారెస్ట్ అంటారు.
  • ఫారెస్ట్ అనేది లాటిన్ భాషా పదమైన ఫోరస్ అనే పదం నుంచి ఉద్భవించింది. -
  • ఫోరస్ అంటే గ్రామం వెలుపలి ప్రాంతం అని అర్థం. -
  • అడవుల గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ఫారెస్ట్రీ అంటారు. -
  • దేశంలో 1927లో బ్రిటిష్ ప్రభుత్వం అటవీ చట్టాన్ని చేసింది. -
  • 1952లో నూతన అటవీ విధానాన్ని భారత ప్రభుత్వం రూపొందించింది. (ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్) -
  • ఈ అటవీ విధానం ప్రకారం దేశ భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాలి. -



  • తెలంగాణ రాష్ట్ర అటవీ నివేదిక - 2015-16 ప్రకారం
  • తెలంగాణ అటవీ విస్తీర్ణం - 27,292 చ.కి.మీ. - తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం - 24.35 -
  • భారత్‌లో అడవుల విస్తీర్ణం పరంగా తెలంగాణ స్థానం - 12 ()
  • భారతదేశ అటవీ విస్తీర్ణం - 7,01,673 చ.కి.మీ. -
  • భారతదేశ విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం - 21.34 అటవీ విధాన లక్ష్యం

  • తెలంగాణలో జీవ వైవిధ్యత -
  • 2800 రకాల మొక్కలు -
  • 21 రకాల ఉభయచరాలు -
  • 108 రకాల క్షీరదజాతులు -
  • 365 రకాల పక్షిజాతులు -
  • 28 రకాల సరీసృపాలు ఉన్నాయి -
  • జీవవైవిధ్య రక్షిత ప్రాంతాలు 12.
  • దీనిలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు (అభయారణ్యాలు)-9,
  • జాతీయ పార్కులు- 3 ఉన్నాయి
  • తెలంగాణలో చిరుతపులి, అడవిదున్న, పులులు, నాలుగు కొమ్ముల దుప్పి, కృష్ణజింక, బురద మొసలి, డేగలు మొదలైన జంతువులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.
  • వీటిని కాపాడటానికి ఆవాసాంతర రక్షణ, ఆవాసేతర రక్షణలను ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉంది. -
  • ఆవాసాంతర రక్షణ- జాతీయపార్కులు, అభయారణ్యాలు, బయోస్పియర్ రిజర్వులు. ఆవాసేతర రక్షణ- జీన్ బ్యాంకుల ఏర్పాటు ఉంటుంది.

తెలంగాణలోని జాతీయ పార్కులు

1. కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు, జూబ్లీహిల్స్, హైదరాబాద్ - స్థాపన - 1998 - విస్తీర్ణం - 1.42 చ.కి.మీ. - ఇది పక్షులకు ప్రసిద్ధి - పక్షి జాతుల సంఖ్య - 140 - మొక్క జాతుల సంఖ్య - 600


2.మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కు, వనస్థలిపురం, రంగారెడ్డి

- స్థాపన - 1975 - విస్తీర్ణం - 14.59 చ.కి.మీ. - సంరక్షిస్తున్న ముఖ్య జంతువు - జింక

3.మృగవని జాతీయ పార్కు, చిలుకూరు, మొయినాబాద్, రంగారెడ్డి

- స్థాపన - 1994 - విస్తీర్ణం - 3.6 చ.కి.మీ. - ఇక్కడ సంరక్షిస్తున్న జంతువు - కుందేలు, అడవిపిల్లి, రక్తపింజర, పైథాన్ (కొండ చిలువ), అడవి పంది - ఈ జాతీయ పార్కు పూర్వపు పేరు - చిలుకూరు రిజర్వు ఫారెస్ట్ - దీన్ని 1994లో వైల్డ్‌లైఫ్ అభయారణ్యంగా భారత ప్రభుత్వం ప్రకటించింది.

(దేశంలోని మొత్తం జాతీయ పార్కుల సంఖ్య- 104, అభయారణ్యాల సంఖ్య- 536 (2016, ఏప్రిల్ వరకు))

తెలంగాణలోని అభయారణ్యాలు -9

1. కవ్వాల్ అభయారణ్యం - వైశాల్యం - 892 చ.కి.మీ. - ఇది ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో విస్తరించి ఉంది. - దీనిలో 4 పులులు ఉన్నాయి. నీల్‌గాయ్, అరిచే జింకలు, అడవి దున్న ఉన్నాయి.

2. ప్రాణహిత అభయారణ్యం

- మంచిర్యాల జిల్లా (ప్రాణహిత నది పరీవాహక ప్రాంతం) - వైశాల్యం - 136 చ.కి.మీ. - అంతరించిపోయే దశలో ఉంది. - కృష్ణజింక, చింకార, తాబేళ్లు ఉన్నాయి.

3. శివారం అభయారణ్యం

- పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో విస్తరించి ఉంది - వైశాల్యం - 29.81 చ.కి.మీ. - మొసళ్లు, కష్ణజింక, ఎలుగుబంట్లు ఉన్నాయి

4. ఏటూరు నాగారం అభయారణ్యం

- ఏటూరు నాగారం, జయశంకర్ భూపాలపల్లిలో విస్తరించి ఉంది. - వైశాల్యం - 806.15 చ.కి.మీ. - దీనిలో తోడేళ్లు, నీల్‌గాయ్, సాంబార్, కృష్ణజింక, మచ్చల జింక ఉన్నాయి. గమనిక: ఇది తెలంగాణలో పురాతన అభయారణ్యం

- దీని గుండా గోదావరి నది ప్రవహిస్తుంది

- ఈ అభయారణ్యంలో రాక్షస గూళ్లు, చారిత్రక యుగానికి చెందిన శిలాధారాలు లభించాయి.

5. పాకాల అభయారణ్యం

- పాకాల, వరంగల్ గ్రామీణ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. - వైశాల్యం - 860 చ.కి.మీ - దీనిలో జంతు జాతులు- సాంబార్, నీల్‌గాయ్, స్లోత్ బేర్, నాలుగు కొమ్ముల దుప్పి, కృష్ణజింక, అడవి పందులు - దీనిలోని పక్షి జాతులు - కొంగలు, గుడ్లగూబలు, అడవి బాతులు

6. కిన్నెరసాని అభయారణ్యం

- పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం - వైశాల్యం - 635.40 చ.కి.మీ. - దీనిలోని జంతువులు - చింకార, హైనా, సాంబార్, అడవి పంది, అడవి దున్న, పులి, కృష్ణజింక

7. అమ్రాబాద్ అభయారణ్యం (రాజీవ్ గాంధీ వైల్డ్‌లైఫ్ అభయారణ్యం)

- నాగర్‌కర్నూలు, నల్లగొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. - విస్తీర్ణం - 2166.37 చ.కి.మీ. - సంరక్షించే జంతువులు - బెంగాల్ పులి, చిరుత, సాంబార్, కృష్ణజింక గమనిక: ఈ అభయారణ్యాన్ని 1978లో వన్యమృగ సంరక్షణ కేంద్రంగా గుర్తించారు. 1983లో పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించారు. - ఇది దేశంలోనే అతిపెద్ద అభయారణ్యం - రాష్ట్ర విభజనవల్ల ఈ అభయారణ్యాన్ని విభజించారు. తెలంగాణ ప్రభుత్వం అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తిస్తూ 2015, ఫిబ్రవరి 6న ఉత్తర్వులు జారీ చేసింది. - దీనిలోని పులుల సంఖ్య - 9 - ఇండియాలో అత్యధిక పులులు ఉన్న రాష్ట్రం- కర్ణాటక (406) - ఇండియాలో మొత్తం పులుల సంఖ్య- 2226

8. మంజీర అభయారణ్యం

- మెదక్ జిల్లాలో ఉంది - విస్తీర్ణం - 20 చ.కి.మీ. - ఈ అభయారణ్యంలో 70 రకాల వివిధ పక్షిజాతులు, క్షీరదాలు, వృక్షజాతులు, సరీసృపాలు ఉన్నాయి. - ఇది ప్రధానంగా మగ్గర్ మొసళ్లకు ప్రసిద్ధి.

9. పోచారం అభయారణ్యం

- ఇది కామారెడ్డి- మెదక్ జిల్లాల్లో విస్తరించి ఉంది. - విస్తీర్ణం- 130 చ.కి.మీ. - ఈ అభయారణ్యం నెమళ్లు, పాములు, కొంగలు, బాతులు, చిరుత పులులకు ప్రసిద్ధి

( ఔషధ అభయారణ్యం - అనంతగిరి)

 దేశంలో మొదటి జాతీయ పార్కు - హేలి (ఉత్తరాఖండ్, 1935) - ప్రస్తుతం దీన్ని జిమ్‌కార్బెట్ జాతీయపార్కు అని పిలుస్తున్నారు. - ఇది ఒక వేటగాడి పేరున ఏర్పడిన జాతీయ పార్కు

జీవావరణ కేంద్రాలు

- వీటి సరిహద్దులను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. జంతువులతోపాటు అన్నిరకాల జీవజాతులను రక్షిస్తారు. ఇందులో టూరిజాన్ని అనుమతివ్వరు. - ఇండియాలో మొదట గుర్తించిన జీవావరణ కేంద్రం - నీలగిరి (తమిళనాడు, 1986) - ఇండియాలో ఇటీవల గుర్తించిన జీవావరణ కేంద్రం- పన్నా (మధ్యప్రదేశ్, 2011) - ప్రస్తుతం ఇండియాలోని జీవావరణ కేంద్రాల సంఖ్య- 18 - వీటిలో 10 జీవావరణ కేంద్రాలు యునెస్కో జాబితాలో చేర్చారు. - ఇండియాలోని అతిపెద్ద జీవావరణ కేంద్రం- రాణా ఆఫ్ కచ్ (గుజరాత్, 12,454 చ.కి.మీ.) - ఇండియాలోని అతిచిన్న జీవావరణ కేంద్రం- దిబ్రు సైకోవా (అసోం, 765 చ.కి.మీ.) - యునెస్కో వారు గుర్తించిన జీవావరణ కేంద్రాలు

1. నీలగిరి (తమిళనాడు)

2. మన్నార్ సింధుశాఖ (తమిళనాడు) 3. సుందర్‌బన్ (పశ్చిమబెంగాల్) 4. నందాదేవి (ఉత్తరాఖండ్) 5. అగస్త్యమలై (కేరళ, తమిళనాడు) - అగస్త్యమలై జీవావరణ కేంద్రాన్ని ఇటీవల 2016లో యునెస్కో జాబితాలో చేర్చారు.

తెలంగాణలోని జూలాజికల్ పార్కులు

1. నెహ్రూ జూలాజికల్ పార్క్ - షామీర్‌పేట, హైదరాబాద్, 1963, అక్టోబర్ 3 - ఇది సహజ పరిస్థితులను కల్పింపజేసి ఏర్పాటుచేసిన జూపార్కుల్లో దేశంలోనే మొదటిది.

2. వన విజ్ఞాన కేంద్రం

- వరంగల్, 1985

3.2001లో కరీంనగర్‌లో ఉజ్వల పార్కును ఏర్పాటు చేశారు.

తెలంగాణలోని ప్రధాన జింకల పార్కులు (ప్రభుత్వ ఆధ్వర్యంలోనివి)

1. కిన్నెరసాని జింకల పార్కు- పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం
2. లోయర్ మానేరు డ్యాం జింకల పార్కు- కరీంనగర్
3. జవహర్‌లాల్ నెహ్రూ జింకల పార్కు- షామీర్‌పేట,హైదరాబాద్

అటవీ విధానాలు తరువాయి పేజీలో


Monday, October 1, 2018

జూనియర్ పంచాయతీ కార్యదర్శి

తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం 2018
http://www.shineindiaeducation.com/telangana-panchayat-raj-act-2018-section-3-141-in-telugu-pdf/