గ్రౌండ్ రిపోర్ట్ (సికింద్రాబాద్) మార్చ్ 29
అతనొక బాల కార్మికుడు,5వ యేటనే కుటుంబ భారాన్ని తనపై వేసుకుని రాత్రనక, పగలనక కష్టపడేవాడు,10 సంవత్సరాల ప్రాయంలోనే విద్య విలువ తెలుసుకొని, తను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి చదువు ఒక్కటే మార్గమని నమ్మి ఒక పూట పాఠశాలకు , మరొక పూట పనికి వెళ్ళడం ప్రారంభించాడు.ఉదయం తన దిన చర్య ఇంటింటికీ న్యూస్ పేపర్ వేయడంతో ప్రారంభం అయ్యేది.ఒక రోజు న్యూస్ పేపర్ లో వారి జిల్లా కలెక్టర్ నీ సన్మానించడం అనే వార్త చూసాడు.ఆ వార్త చదువుతున్న క్రమంలోనే కలెక్టర్ అనే ఉద్యోగం ఉంటుందని తెలుసుకున్నాడు. ఆ ఉద్యోగం వస్తె తన లాంటి అనేక మందికి ఆసరాగా నిలబడవచ్చని ,ఆ చిరు ప్రాయంలోనే కలెక్టర్ కావాలని నిర్ణయించుకున్నాడు, ఒక రోజు పాఠశాలలో ఉపాధ్యాయుడు పెద్దయ్యాక మిరేమవుతారు అనే ప్రశ్నకు కలెక్టర్ అవుతానని సమాధానమిచ్చాడు. ఒక్కసారి తరగతి గది అంతా నువ్వు పాఠశాలకు వచ్చేదే ఒక్క పూట అంటూ వెటకారపు నవ్వుతో దద్దరిల్లిపోయింది. అప్పుడే తనలో ఉన్న కలెక్టర్ కావాలన్న కాంక్ష మరింత బలపడింది.
కలెక్టర్ కావాలంటే ఐఏఎస్ చదవాలని ,అది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది అని మన లాంటి పేద వాళ్ళకి అది సాధ్యం కాదని చాలామంది చెప్పారు. నీ వల్ల కాదు అన్న ప్రతి సారి తనలోని కాంక్ష మరింత బలపడింది. ఒక్కటే ధ్యాస కలెక్టరు కావడమే.పేపర్ బాయ్, రిక్షా పుల్లర్, టూషన్ మాస్టర్ గా వివిధ పనులు చేసుకుంటూ మొత్తం మీద బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మి నిస్ట్రేషన్ (BBM) పూర్తి చేశాడు. ఐఏఎస్ పరీక్ష రాయడానికి కావల్సిన కనీస అర్హత సాధించాడు. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ప్రభుత్వం "మెరుగు" అనే కార్యక్రమం ప్రారంభించింది.(డిగ్రీ చదువుతున్న వారిని ఒక పరీక్ష ద్వారా ఎంపిక చేసి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే కార్యక్రమం ఇది) "మెరుగు" కార్యక్రమం వారు నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించి డిగ్రీ తో పాటు ఇతర పోటీ పరీక్షలకు కూడా శిక్షణ పొందాడు.అప్పుడే ఐఏఎస్ చదవాలంటే హైదరాబాద్ లో ఉండాలి, మెరుగైన కోచింగ్ అవసరం అని తెలుసుకొని. హైదరాబాద్ లో ఉండడం ఎలా అని ఆలోచిస్తుంటే ఒక స్నేహితుడి సలహా మేరకు లాసెట్ రాసి రాష్ర్ట స్థాయిలో ద్వితీయ ర్యాంక్ సాధించాడు.
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ లో సీట్ సంపాదించాడు. సివిల్స్ కోసం సీరియస్ గా ప్రిపరేషన్ ప్రారంభించాడు. తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ వరకు వెళ్ళాడు. గ్రామీణ నేపథ్యం, మామూలు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివి ఉండడం వల్ల సహజంగా ఉండే బెరుకు వల్ల ఇంటర్వ్యూ బోర్డ్ ను మెప్పించలేక స్వల్ప మార్కులతో సర్వీస్ కోల్పోయాడు.
అయినా స్థైర్యాన్ని కోల్పోకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు. అలా నాలుగు సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా ఇంటర్వ్యూ బోర్డ్ తన ప్రతిభను గుర్తించలేక పోయింది. ఈ ప్రయాణంలో నే తనకి జన్మనిచ్చిన తల్లి తండ్రిని కోల్పోయాడు.
ప్రిపరేషన్ లో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మోడల్ స్కూల్ లో పీజీటీ ఉద్యోగం వచ్చింది. కాని చిన్నప్పటి నుండి తన లాంటి వాళ్లను దారిద్ర్య శృంఖలాల నుండి బయట పడేయాలన్న సంకల్పం బలంగా తన మస్తిష్కంలో నాటుకుపోవడంతో ఆ ఉద్యోగాన్ని సైతం వదిలేశాడు. ఆయనే రవికుమార్ వోదెల. ప్రస్తుతం సివిల్స్ ఫ్యాకల్టీ గా పనిచేస్తున్నాడు. కార్మిక, కర్షక, నిరుద్యోగ ,తాడిత, పీడిత వర్గాలు బల పర్చిన స్వతంత్ర అభ్యర్థిగా సికింద్రాబాదు పార్లమెంటు స్థానానికి "టూత్ బ్రష్" గుర్తుతో పోటీ చేస్తున్నాడు.
No comments:
Post a Comment