Monday, October 1, 2018

తెలంగాణ ఉద్యమంలో ఓటాయి గ్రామ పాత్ర



 గ్రౌండ్ రిపోర్ట్ అక్టోబర్2:

తెలంగాణ ఉద్యమంలో ఓటాయి గ్రామ పాత్ర
1.తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన నినాదం "నీళ్లు నిధులు నియామకాలు" ఓటాయి గ్రామం నుండే  వచ్చింది ప్రొఫెసర్ Dr బియ్యాల జనార్దన్ రావు సర్ ఇచ్చినదే.

2.1969 తెలంగాణ ఉద్యమం విఫలమైన తర్వాత అప్పుడున్న కోపోద్రిక్త యువతరం నక్సల్బరీ పంథాలో తెలంగాణ సాధన కోసం ఉపక్రమించింది. ఆ పిలుపుకి ప్రతిస్పందనగా ఓటాయి యువత భూమి కోసం, భుక్తి కోసం, తాడిత పీడిత విముక్తి కోసం ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో పాల్గొన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుల్లో ఓటాయి గ్రామవాసులు ఉన్నారు.

 భౌగోళికంగా ఓటాయి గ్రామం ఎంతో విశిష్టమైనది ఓటాయి గ్రామo లో పడ్డ వర్షపు నీరు కృష్ణా, గోదావరి  రెండు నదుల్లో కలుస్తుంది.కొంత నీరు లక్నవరం సరస్సు లో (గోదావరి బేసిన్) కొంత నీరు పాకాల సరస్సులో (కృష్ణా బేసిన్) కలుస్తుంది.

చారిత్రకంగా ఓటాయి గ్రామంలో చరిత్ర పూర్వ యుగం నుండి జనావాసాలు ఉన్నట్లు మన మర్రి చెట్టు కింద ఉన్న రాక్షసగూడే (రంగుల రాట్నం ని పోలిన నిర్మాణం)నిదర్శనం (Megalithic Structure). ఇలాంటి నిర్మాణాలు తాడ్వాయి అడవుల్లో కూడా ఉన్నాయి.
కాకతీయుల కాలం నాటి ఆనవాళ్లు అనేకం మన ఊళ్ళో ఉన్నాయి. కాకతీయుల కాలంలో యుద్ధంలో గెలిచిన వీరులను విగ్రహాల రూపంలో కొలిచే విరగళ్ సాంప్రదాయం ఉండేది.మన గ్రామంలోని "పోటోని గడ్డ" లో కోటి చెరువు కి పోయే దారిలో ఉన్న "వీర్లు" ఈ వీరగళ్

2011 జనాభా లెక్కల ప్రకారం
 మొత్తం జనాభా- 2543 మంది,
మొత్తం జనావాసాలు- 688
 గ్రామంలో పురుషుల జనాభా కన్న స్త్రీ జనాభా ఎక్కువ.51.1%.(1300మంది)
అక్షరాస్యత 51%(1298 మంది అక్షరాస్యులు)(తెలంగాణ సగటు అక్షరాస్యత కన్నా తక్కువ),
స్త్రీ ల అక్షరాస్యత 22.2%(565మంది)
మొత్తం జనాభాలో గిరిజన జనాభా 49.1%(1249 మంది)
షెడ్యూలు కులాల జనాభా 12.7%(323)

ఓటాయి మొత్తం విస్తీర్ణం 270.08 హెక్టార్లు
వ్యవసాయేతర భూమి 26.52 హెక్టార్లు
వ్యవసాయ భూమి 245 హెక్టార్లు.

రాజ్యాంగంలోని 5 వ షెడ్యూల్ లో  పొందుపరచడ్డ గ్రామం ఓటాయి

No comments:

Post a Comment