Monday, October 1, 2018

గ్రౌండ్ రిపోర్ట్ అక్టోబర్ 2 :కొత్తగూడ మండలంలో గత నెల రోజులుగా వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం తద్వారా గాలి లోని తేమ శాతం పెరిగి తీవ్రమైన ఉక్కపోతతో చెమటలు పట్టి, గాలి వీయకపోవడం వలన చెమటతో శరీరం జిగటగా మారి తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాము. మండలం అంతా కొండలు, గుట్టలతో ఉన్న భూభాగం ఎక్కువగా ఉండడం,ఈ భూభాగానికి తొందరగా వేడెక్కే లక్షణం ఉండడంతో, భూమి బాగా వేడెక్కినప్పుడు దాన్ని అనుకుని ఉన్న గాలి కూడా వేడెక్కి తేలికై పైకి పోయిి, ఈ గాలి పైకి చేరగానే వ్యాకోచించి చల్లబడి, చల్లదనం వల్ల మేఘాలు ఏర్పడడం (వీటినే కుమ్యులోనింబస్ మేఘాలు అంటారు), మరియు ఈ గాలి తేమను ఇమడ్చుకునే సామర్త్యాన్ని కోల్పోవడం జరుగుతుంది., దీని కారణంగా మేఘాల్లోని నీటి ఆవిరి ద్రవీభవించి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం సంభవిస్తుంది. ఈ విధంగా కురిసే వర్షపాతాన్నీ  సంవహన వర్షపాతం అంటారు. గత , వారం రోజులుగా కొత్తగూడ  మండలంలో మధ్యాహ్నం వరకు ఉష్ణోగ్రతలు పెరగడం. దాంతో వేడెక్కిన గాలి ఊర్ధ్వంగా పైకి వెళ్ళి కుమ్యులోనింబస్ మేఘాలు ఏర్పడడం, ఈ మేఘాలనుండే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడం, ఈ వర్షం కురిసిన కొద్ధి సేపటికే ఆకాశం నిర్మలంగా మారడం,ఎవరో ఒకరు పిడుగుపాటుకు గురై చనిపోయారని చేదు వార్త వినడం జరుగుతుంది.

No comments:

Post a Comment